Srinivasa Mangapuram | ‘శ్రీనివాస మంగాపురం’లో మీరు ఇప్పటివరకు చూడని తిరుపతిని చూస్తారు: అజయ్ భూపతి క్రేజీ అప్డేట్
'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ఇప్పుడు తన తదుపరి చిత్రం 'శ్రీనివాస మంగాపురం' (SrinivasaMangapuram)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Srinivasa Mangapuram | ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (#SrinivasaMangapuram)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు అజయ్. ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలోని మరో కోణాన్ని, ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త పార్శ్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. “మీరు ఇప్పటివరకు చూడని తిరుపతిని చూపిస్తాను.. సిద్ధంగా ఉండండి” అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రం ద్వారా సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఆయన సరసన ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టును వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ మరియు సి.కె. పిక్చర్స్ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తిరుపతి నేపథ్యంలో అజయ్ భూపతి శైలిలో ఎంత ‘రా’ అండ్ ‘రస్టిక్’గా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Stay Tuned to witness the other side of TIRUPATHI in #SrinivasaMangapuram 🤩❤️🔥#JayaKrishnaGhattamaneni #RashaThadani @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl @VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/lL5HTdqu2S
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

