Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh | టాలీవుడ్ ప్రేమజంట విజయ్ దేవరకొండ- రష్మిక మంధాన ఫిబ్రవరి 26న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ జంట అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విద్యాభ్యాసానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Virosh | టాలీవుడ్ ప్రేమజంట విజయ్ దేవరకొండ- రష్మిక మంధాన ఫిబ్రవరి 26న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ జంట అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విద్యాభ్యాసానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్, రష్మిక ఇద్దరూ తమ చదువును పూర్తి చేసి తర్వాతే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
విజయ్ దేవరకొండ తొలుత హైదరాబాద్‌లోని లోకల్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయర్ సెకండరీ స్కూల్లో హాస్టల్లో ఉంటూ 10వ తరగతి వరకు చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో కామర్స్ డిగ్రీ చేశారు. డిగ్రీ పూర్తయ్యాకే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి, తరువాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా గుర్తింపు పొందారు. ఇక రష్మిక మందన్న మొదట కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత గొనికొప్పలోని స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు.
అనంతరం బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ స్టైన్స్ అండ్ కామర్స్ లో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ చేశారు. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ ప్రారంభించిన రష్మిక, తరువాత కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్‌తో దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఇలా విజయ్ – రష్మిక ఇద్దరూ డిగ్రీ పూర్తిచేసి తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో స్టార్ హోదాలో కొనసాగుతున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటవుతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి వెడ్డింగ్ ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదువులోనూ మెరుపులు మెరిపించిన ఈ స్టార్ కపుల్… జీవితంలోనూ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

