నల్లగొండ : రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది.
ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నల్లగొండలో యూరియా సమస్యలు తీర్చాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పానగల్లు పీఏసీఎస్ గోదాం దగ్గర స్మార్ట్ ఫోన్ పట్టుకుని బుకింగ్ కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.