Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’లో ఎన్టీఆర్ డైలాగ్పై దుమారం.. సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల ఆగ్రహం
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్, కొరియన్ అండర్‌వరల్డ్ అంశాలు, అతీంద్రియ శక్తుల కలయికతో రూపొందిన ఈ చిత్రం వినోదాత్మకంగా సాగుతుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ నటన, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్, కొరియన్ అండర్‌వరల్డ్ అంశాలు, అతీంద్రియ శక్తుల కలయికతో రూపొందిన ఈ చిత్రం వినోదాత్మకంగా సాగుతుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ నటన, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాలో కొరియా నుంచి వచ్చిన ఓ ఆత్మ హీరోను ఆవహించడం, ఆ తర్వాత జరిగే సంఘటనలు హాస్యభరితంగా తెరకెక్కించారు.. ముఖ్యంగా సెకండాఫ్‌లో సత్య, మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. అలాగే తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. 1978లో విడుదలైన ‘యుగపురుషుడు’ చిత్రంలో నటసార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన “మీ షాట్ చాలా అమెచ్యూరీష్గా ఉంది” అనే డైలాగ్‌ను ఈ చిత్రంలోని ఓ ఫైట్ సీన్లో వినియోగించారు. ఆ సన్నివేశంలో కమెడియన్ సత్య అదే డైలాగ్ చెప్పడం థియేటర్లలో నవ్వులు పంచుతున్నప్పటికీ, దీనిపై నందమూరి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురు అభిమానులు స్పందిస్తూ.. సీనియర్ ఎన్టీఆర్‌కు చెందిన ఐకానిక్ డైలాగ్‌ను కామెడీ కోసం ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కొందరు నెటిజన్లు ఈ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించాలని, చిత్రబృందం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఈ వివాదంపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, వాటిపై ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అలాగే చిత్రబృందం కూడా ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు.ఇదిలా ఉండగా, కొరియన్ కనకరాజు కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, ఈ వివాదం సినిమా చుట్టూ మరింత చర్చకు దారితీసింది. ఈ అంశంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Orey 😂🤣🤣
Veedi STROKES chaala..AMATEURISH గా ఉన్నాయి…
Trend ni follow avthu movie lo pettesar kadhara 🔥 #KoreanKanakaraju pic.twitter.com/9Bxg97eeHl— Gana (@GanaEdits) August 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

