బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారు ప్రాంతంలో ఉన్న డెబ్సిరిన్ నాన్తబురి స్కూల్లో ఇవాళ కాల్పుల(Thailand Shooting) ఘటన చోటుచేసుకున్నది. 9వ గ్రేడ్ చదువుతున్న ఓ విద్యార్థి కాల్పులకు తెగించాడు. ఈ ఘటనలో ఆ షూటర్‌తో పాటు మరో టీచర్ మృతిచెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యను ఇప్పుడే నిర్ధారించలేమని జిల్లా పోలీసు అధికారి లెఫ్టినెంట్ కల్నల్ పాసాకార్న్ చైత్వావివాంగ్ తెలిపారు. నాన్తబురి ప్రావిన్సులో ఉన్న బంగ్ కురాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన షూటర్‌ను విద్యార్థిగా పోలీసులు తేల్చారు. కానీ పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
కాల్పుల ఘటన సమయంలో స్కూల్‌కు ఎమర్జెన్సీ వర్కర్లు చేరుకున్నారు. అంబులెన్సులు కూడా వచ్చాయి. గాయపడ్డ విద్యార్థులకు మెడిక్స్ చికిత్సను అందిస్తున్నారు. డెబ్సిరిన్ స్కూల్‌కు చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రఖ్యాత సెకండరీ స్కూల్‌గా గుర్తింపు ఉంది. ఆ స్కూల్‌కు దేశంలో అనేక చోట్ల బ్రాంచీలు ఉన్నాయి. అయితే షూటింగ్ ఘటన జరిగిన నాన్తబురి బ్రాంచీ.. బ్యాంకాక్ శివారం ప్రాంతంలో ఉంటుంది. 1885లో థాయ్ చక్రవర్తి చులాలాంగ్‌కార్న్ .. దెబ్సిరిన్ స్కూల్‌ను స్థాపించారు. ఈ స్కూల్లో చాలా మంది ఫేమస్ పర్సనాల్టీలు చదువుకున్నారు.