Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..!
Allu Arjun | 'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపు సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న బన్నీ, ఆ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న AA23పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Allu Arjun | ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపు సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న బన్నీ, ఆ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న AA23పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం, AA23 లో కీలకమైన ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సాధారణ గెస్ట్ రోల్ కాకుండా, కథలో హీరోతో సమానంగా తలపడే శక్తివంతమైన పాత్రగా ఉండబోతుందని టాక్. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో ప్రతినాయకుల పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మాస్టర్ లో విజయ్ సేతుపతి, విక్రమ్ లో సూర్య, లియో లో సంజయ్ దత్, కూలీ లో నాగార్జున వంటి స్టార్ నటులను విభిన్నమైన నెగెటివ్ షేడ్స్‌లో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే తరహాలో AA23 లో కూడా బలమైన, ఇంటెన్స్ విలన్ పాత్రను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక షాహిద్ కపూర్ కూడా ‘కబీర్ సింగ్’, ‘ఫర్జీ’ వంటి ప్రాజెక్ట్‌లలో తన నటనతో విశేష ప్రశంసలు అందుకున్నారు. ఆయన నిజంగానే ఈ చిత్రంలో భాగమైతే ఉత్తరాది మార్కెట్లో సినిమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండగా, విదేశీ లొకేషన్లు, భారీ సెట్లలో చిత్రీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కథ మొత్తం పవర్ఫుల్ యాక్షన్, కాన్ఫ్లిక్ట్ డ్రామా చుట్టూనే తిరుగుతుందని, ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే ప్రచారం కూడా సాగుతోంది.మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రంపై కూడా రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. కథ, పాత్రలు, సాంకేతిక ప్రమాణాలపై ఇప్పటికే పలు వార్తలు వైరల్ అవుతుండగా, ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

