హైదరాబాద్ : ఇరాన్‌పై(,Iran war) దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అమెరికా(America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దురంకార, ఒంటెత్తు పోకడలపై సొంత దేశంతో పాటు ప్రపంచ వ్యప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ మృతితో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా వివిధ దేశాల్లో ఆందోళనలు చేపట్టారు.
అమెరికాలోని న్యూయార్క్ టైమ్‌స్కేర్ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున గుమిగూడి కొలంబో సర్కిల్ చుట్టూ కవాతు చేశారు. ట్రంప్, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధం పేరుతో పసిపిల్లలు, అమాయకుల ప్రాణాలను బలితీసుకోద్దన్నారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.