బెంగళూరు: జ్యుయలరీ షాపులో పట్టపగలు చోరీ జరిగింది. సాయుధులైన కొందరు వ్యక్తులు ఆ షాపులోకి ప్రవేశించారు. గన్స్ గురిపెట్టి సిబ్బందిని బెదిరించించారు. సుమారు రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. (Robbery in jewellery Shop) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మైసూరులో ఈ సంఘటన జరిగింది. హున్సూర్ బస్టాండ్ సమీపంలో స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఉన్నది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాస్కులు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఆ షాపులోకి ప్రవేశించారు. గన్స్ చూపించి అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. ఒక వ్యక్తి గన్ పేల్చి కస్టమర్లు, సిబ్బందిని భయపెట్టాడు. దీంతో వారంతా నేలపై కూర్చొన్నారు.
కాగా, అరల్లో ఉన్న ఉన్న గోల్డ్, డైమండ్ ఆభరణాలను మరో వ్యక్తి కుప్పలుగా పోశాడు. తలకు హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు వెంట తెచ్చిన బ్యాగుల్లో వాటిని నింపారు. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ జ్యుయలరీ షాపు వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
మరోవైపు ఆదివారం మధ్యాహ్నం వేళ చాలా మంది సిబ్బంది భోజనం కోసం వెళ్లగా షాపులో కొంత మంది ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. సిబ్బందిని ప్రశ్నించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ దోపిడీకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In a broad daylight heist, a gang of five armed robbers looted gold and diamond jewellery worth nearly Rs 4.5 crore from a showroom near the Hunsur Bus Stand in #Mysuru in #Karnataka on Sunday afternoon.
The robbery took place at Sky Gold and Diamonds between 1.30 pm and 2 pm… pic.twitter.com/G2hRTorehB
— Hate Detector 🔍 (@HateDetectors) December 29, 2025
Also Read:
mother kills daughter | హిందీ మాట్లాడుతున్నదని.. కుమార్తెను హత్య చేసిన తల్లి
Teens Attack Migrant Worker | వలస కార్మికుడిపై కత్తులతో దాడి.. విక్టరీ చిహ్నంతో యువకుల పోజులు
Newlywed Couple Dies By Suicide | కొత్తగా పెళ్లైన జంట.. కొన్ని రోజులకే వేర్వేరుగా ఆత్మహత్య
Declares Living Patient Dead | బతికున్న రోగిని చనిపోయినట్లు ప్రకటన.. తర్వాత ఏం జరిగిందంటే?