IND vs RSA | దంచేసిన మిల్లర్, బ్రెవిస్.. భారీ స్కోర్‌తో సవాల్ విసిరిన దక్షిణాఫ్రికా..!
IND vs RSA : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్లు చెలరేగిపోయారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(3-15) టాపార్డర్‌ను కూల్చినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45) విధ్వంసక ఆటతో రెచ్చిపోయారు. 2
IND vs RSA : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్లు చెలరేగిపోయారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(3-15) టాపార్డర్‌ను కూల్చినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45) విధ్వంసక ఆటతో రెచ్చిపోయారు. 20కే మూడు వికెట్లు పడినా.. ఒత్తిడికి లోనవ్వని ఈ ద్వయం మిడిల్ ఓవర్లలో బౌండరీల మోత మోగించింది. నాలుగో వికెట్‌కు 97 రన్స్ జోడించిన ఈ జోడీ వెనుదిరిగాక.. సఫారీల స్కోర్ వేగానికి బుమ్రా, అర్ష్‌దీప్ కళ్లెం వేశారు. అయినా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్(44 నాటౌట్) దంచేయడంతో మర్క్రమ్ సేన7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
సూపర్ 8 తొలి పోరులో ఆరంభంలోనే దక్షిణాఫ్రికాను వణికించిన భారత బౌలర్లు ఆ తర్వాత పట్టు సడలించారు. ఫలితంగా అద్భుతంగా పుంజుకున్న సఫారీ టీమ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టుకు షాకిస్తూ జస్ప్రీత్ బుమ్రా(3-15) తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(6)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. డేంజరస్ రియాన్ రికెల్టన్(7)ను ఔట్ చేసిన సఫారీలను కష్టాల్లో పడేశాడు.
Arshdeep Singh gets his 2️⃣nd wicket ✌️
Marco Jansen departs as #TeamIndia continues to build the pressure!
Updates ▶️ https://t.co/ZE8J4fF18z#T20WorldCup | #MenInBlue | #INDvSA pic.twitter.com/5dK1zrzPre
— BCCI (@BCCI) February 22, 2026
అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో ఎడెన్ మర్క్రమ్(4) సర్కిల్లోనే హార్దిక్ పాండ్యాకు దొరికిపోయాడు. అంతే.. 20కే మూడు కీలక వికెట్లు పడ్డాయి. అయినా ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వని డేవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్(45) దూకుడుగా ఆడి స్కోర్ వేగం పెంచారు. వరుణ్ ఓవర్లో మిల్లర్, బ్రెవిస్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. పాండ్యా, దూబేలను సైతం వదల్లేదీ ద్వయం.
A brilliant batting display from David Miller and Dewald Brevis powered South Africa to a commanding total against India.#INDvsSA #T20WorldCup2026 #Ahmedabad pic.twitter.com/aadIt0oAGF
— CricTracker (@Cricketracker) February 22, 2026
97 పరుగుల భాగస్వామ్యం
భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మిల్లర్. బ్రెవిస్ విధ్వంసక ఆటతో స్కోర్ వంద దాటించారు. దూబే ఓవర్లో భారీ సిక్సర్ బాదిన బ్రెవిస్.. తర్వాతి బంతినీ ఆడబోయి అభిషేక్ చేతికి చిక్కాడు. అంతే.. నాలుగో వికెట్ 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అక్కడి నుంచి స్కోర్ నెమ్మదించింది. అర్దమిల్లర్ మెరుపులకు వరుణ్ చెక్ పెట్టగా.. మార్కో యాన్సెన్(2) రింకూ చేతికి చిక్కాడు.
బుమ్రా తన చివరి ఓవర్లో కార్బిన్ బాస్చ్(5)ను పెవిలియన్ చేర్చడంతో సఫారీ టీమ్ 170లోపే పరిమితం అవుతుందనిపించింది. కానీ, పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్(44 నాఔట్) బౌండరీ, సిక్సర్ బాది స్కోర్ 180 దాటింది. ఆరో బంతిని అతడు స్టాండ్స్‌లోకి పంపగా భారత్‌కు ప్రొటీస్ జట్టు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

