Milk | పాలను తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
పాలు మనిషి ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఎముకలు, కండరాలకు మద్దతు ఇచ్చే పోషకాలు పాలల్లో అనేకం ఉంటాయి. పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్నవారికి పాలు తీసుకోవాలా వద్దా అనే సందేహం కలుగుతుంది.
Milk | పాలు మనిషి ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఎముకలు, కండరాలకు మద్దతు ఇచ్చే పోషకాలు పాలల్లో అనేకం ఉంటాయి. పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్నవారికి పాలు తీసుకోవాలా వద్దా అనే సందేహం కలుగుతుంది. ఒక గ్లాస్ పాలు కూడా వారికి గందరగోళాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్న వారు పాలను తీసుకోవాలా.. వద్దా.. లేదా మితంగా తీసుకోవాలా.. ఒకవేళ పాలను తీసుకుంటే ఎంత మోతాదులో , ఎటువంటి పాలను తీసుకోవాలి.. వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె సమస్యలకు కారణమవుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి పాల ఎంపిక..
పాలు జంతు సంబంధిత ఆహారం కాబట్టి ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వులు ఉంటాయి. అయితే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడే వారు పాలను పూర్తిగా మానేయడం సరి కాదని వైద్యులు చెబుతున్నారు. శరీర ఆరోగ్యాన్ని బట్టి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి పాలను ఎంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇరుకుగా చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో 200 mg/dl కంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల రక్తప్రవాహం సజావుగా సాగుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. పాలల్లో ఉండే కొవ్వు పదార్థాన్ని బట్టి కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం పడుతుంది. సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. తక్కువ కొవ్వు, మొక్కల ఆధారిత పాలు సాధారణంగా సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు.
పాలను పూర్తిగా మానేయాల్సిన పనిలేదు..
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు పాలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదని సరైన పాలను ఎంపిక చేసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. కొలెస్ట్రాల్ తో బాధపడే వారు ఆవు పాలను తీసుకోవడం మంచిది. వీటిని పరిమితంగా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. వెన్న తీసిన పాలను తీసుకోవడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గేదె పాలు 8 నుండి 10 శాతం కొవ్వును కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగతాయి. కనుక అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు ఈ పాలను తీసుకోకపోవడమే మంచిది. ఇక మేక పాలు ఆవు పాల కంటే కొద్దిగా కొవ్వును ఎక్కువగా కలిగి ఉంటాయి. కనుక వీటిని కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు మితంగా తీసుకోవడం మంచిది.
వృక్ష సంబంధ పాలు అయితే..
అంతేకాకుండా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు మొక్క ఆధారిత పాలను తీసుకోవడం సరైన ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు. బాదం పాలల్లో మంచి కొలెస్ట్రాల్ కు మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు ఉంటాయి. సోయా పాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శోషణ తగ్గుతుంది. ఓట్స్ పాలల్లో బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు వారి కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి సరైన పాలను ఎంచుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు మొక్కల ఆధారిత పాలను ఎంచుకోవడం మంచిదని దీర్ఘకాలికంగా సురక్షితమైన ఎంపికలు అని తక్కువ కొవ్వు కలిగిన పాలను రోజుకు 1 లేదా 2 కప్పుల మోతాదులో తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- milk
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

