యువ భారత్.. ప్రతి నలుగురిలో ఒకరు 24 ఏండ్ల లోపు వయసు వారే!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్లో యువత వాటా గణనీయంగా ఉందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్ పీఏ) నివేదిక వెల్లడించింది. దేశ జనాభాలో 26 శాతం మంది 10-24 ఏండ్ల మధ్య వయసున్నవారేనని తెలిపింది.
- 147 కోట్ల జనాభాలో 26 శాతం మంది యువతే
- ఐక్యరాజ్య సమితి నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్లో యువత వాటా గణనీయంగా ఉందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్ పీఏ) నివేదిక వెల్లడించింది. దేశ జనాభాలో 26 శాతం మంది 10-24 ఏండ్ల మధ్య వయసున్నవారేనని తెలిపింది. స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ నివేదిక ప్రకారం.. భారత్ జనాభా 147.66 కోట్లకు చేరగా, జనాభా రెట్టింపు కావడానికి 81 ఏండ్లు పడుతుంది. దేశ జనాభాలో 0-14 ఏండ్ల వారు 24 శాతం, 10-19 ఏండ్ల వారు 17 శాతం, 15-64 ఏళ్ల వారు 69 శాతం, 65 ఏళ్లు పైబడినవారు 8 శాతం ఉన్నారు.
141.29 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉంది. దేశంలో పురుషుల ఆయుర్దాయం 82 ఏండ్లు, మహిళలది 85 ఏండ్లుగా నివేదిక పేర్కొంది. 35-39 ఏండ్ల మధ్య సంతానం లేని వారిలో 85 శాతం మంది తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్నారు. గత ఏడాది భాగస్వాముల నుంచి హింసను ఎదుర్కొన్న మహిళలు 22.3 శాతంగా ఉన్నారు. మహిళల్లో అక్షరాస్యత పెరుగుతున్నది. పట్టణాల్లో 77.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 57.4 శాతం మంది మహిళలు ఫోన్లు కలిగి ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

