అణు యుద్ధాన్ని ఎవరూ గెలవలేరు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనాలోని షెన్జెన్లో తొలిసారి త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. 90 నిమిషాలపాటు సాగిన ఈ భేటీ అనంతరం ‘డిక్లరేషన్ టువార్డ్స్ పీస్' పేరుతో నాలుగు అంశాల ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
- అలాంటి యుద్ధం ఎప్పటికీ జరగకూడదు
- ట్రంప్, జిన్పింగ్, పుతిన్ ‘పీస్ డిక్లరేషన్’
- చైనాలోని షెన్జెన్లో తొలి త్రైపాక్షిక భేటీ
షెన్జెన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనాలోని షెన్జెన్లో తొలిసారి త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. 90 నిమిషాలపాటు సాగిన ఈ భేటీ అనంతరం ‘డిక్లరేషన్ టువార్డ్స్ పీస్’ పేరుతో నాలుగు అంశాల ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితిని మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు సంస్కరణలు చేపట్టాలని, ప్రపంచదేశాల ప్రయోజనాల కోసం శుద్ధి చేసిన చమురు ఉత్పత్తి, సరఫరాను పెంచాలని నిర్ణయించారు. అణు యుద్ధాన్ని ఎవరూ గెలవలేరని, అణ్వాయుధాల ముప్పును తగ్గించేందుకు, వాటి వ్యాప్తిని నిరోధించేందుకు చర్చలు జరుపాలని అంగీకరించారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికార పరిధిని దుర్వినియోగం చేయరాదని స్పష్టంచేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అంతర్జాతీయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మూడు దేశాలపై ఉందని జిన్పింగ్ పేర్కొన్నారు. వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్, పుతిన్ చర్చించారు. అయితే భవిష్యత్తులో ఈ తరహా సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పుతిన్ తెలిపారు. విభేదాలున్న దేశాలతో చర్చలకు దూరంగా ఉండటం వల్ల సమస్యలు పరిష్కారం కావని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

