కొత్త బీఎస్-6 వాహనాలకు పీయూసీ మూడేండ్లు చెల్లుబాటు
కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాల (పీయూసీ) చెల్లుబాటు గడువును కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త బీఎస్-6 కాలుష్య ప్రమాణాల వాహనాలకు పునరుద్ధరణల మధ్య ఎక్కువ గడువు కల్పి స్తూ, పాత వాహనాలకు తక్కువ గడువునే కొనసాగించింది.
- పదేండ్లు పైబడిన వాటికి ఆరు నెలలకోసారి పరీక్ష
- పీయూసీ చెల్లుబాటు గడువు సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ, నవంబర్ 19 : కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాల (పీయూసీ) చెల్లుబాటు గడువును కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త బీఎస్-6 కాలుష్య ప్రమాణాల వాహనాలకు పునరుద్ధరణల మధ్య ఎక్కువ గడువు కల్పి స్తూ, పాత వాహనాలకు తక్కువ గడువునే కొనసాగించింది. నవంబర్ 13న జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకా రం, ఆరేండ్ల వరకు ఉన్న ప్రైవేట్ బీఎస్ 6 వాహనాలకు మూడేండ్లకోసారి పీయూసీ ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉం టుంది.
6- 10 ఏండ్ల లోపు ఉన్న వాహనాలకు ఏటా పునరుద్ధరణ తప్పనిసరి. 10 ఏండ్లు దాటిన ప్రైవేట్ బీఎస్-6 వాహనాలు మాత్రం ఆరు నెలలకోసారి ధ్రువీకరణ పత్రాన్ని పునరుద్ధరించుకోవాలి. బీఎస్-6 రవాణా వాహనాలకూ ఎక్కువ గడువు కల్పించారు. ఆరేండ్ల వరకు ఉన్న రవాణా వాహనాలకు రెండేండ్లకోసారి, ఆరేండ్లు దాటి 10 ఏండ్ల వరకు ఉన్న వాటికి ఏటా పునరుద్ధరణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

