తిని, తాగి, ఎంజాయ్ చేసే సంస్కృతి మనది కాదు
మన దేశ సంస్కృతి పొదుపుపైనే ఆధారపడి ఉందని, తినడం, తాగడం, వినోదం మన ధోరణి ఎంతమాత్రం కాదని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సభ్యులతో పేర్కొన్నారు.
- పొదుపును పెంచాలి
- ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : మన దేశ సంస్కృతి పొదుపుపైనే ఆధారపడి ఉందని, తినడం, తాగడం, వినోదం మన ధోరణి ఎంతమాత్రం కాదని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సభ్యులతో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే పేదరికం నుంచి బయటపడిన పౌరులు తిరిగి అదే పరిస్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. 2011 – 2023 మధ్య సుమారు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు.
కేవలం వారిని పేదరికం నుంచి తీసుకువస్తే సరిపోదని, తిరిగి వారు దానిలో కూరుకుపోకుండా పొదుపును ప్రోత్సహించడం ముఖ్యమని ఆయన తెలిపారు. దీనికి నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. నక్సలిజం మళ్లీ తలెత్తకుండా నిరంతర చర్యలు కొనసాగించాలని, మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. మాదకద్రవ్యాల ముప్పు, అంతర్గత భద్రత కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

