తమిళనాడు పెట్టుబడుల సమాచారం ఏపీకి లీక్
తమిళనాడు పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ గైడెన్స్ తమ సంస్థలోని 15 మంది సీనియర్ అధికారులను తొలగించినట్టు తెలిసింది. రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చేరవేశారన్నది వీరిపై ప్రధానమైన ఆరోపణ.
- గైడెన్స్ తమిళనాడు సంస్థలో 15 మంది అధికారులపై వేటు
- ఆరోపణలను ఖండించిన ఏపీ
చెన్నై, నవంబర్ 19 : తమిళనాడు పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ గైడెన్స్ తమ సంస్థలోని 15 మంది సీనియర్ అధికారులను తొలగించినట్టు తెలిసింది. రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చేరవేశారన్నది వీరిపై ప్రధానమైన ఆరోపణ. ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారుతున్నది. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది. తమిళనాడులో పెట్టుబడులను ఆకర్షించే ప్రభుత్వ సంస్థ ‘గైడెన్స్ తమిళనాడు’ లో కీలక సమాచారం లీక్ అయిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు, పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన రహస్య వివరాలు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికారులకు చేరాయన్న అనుమానంతో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 15 మంది ఉన్నతాధికారులను తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి.
తొలగించిన వారిలో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నట్లు వెల్లడికావడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే, ఏ సమాచారం లీక్ అయింది? ఎన్ని పెట్టుబడులు ప్రభావితమయ్యాయనే విషయాలు వెల్లడి కాలేదు.ఈ వ్యవహారంపై డీఎంకే నేత టీఆర్బీ రాజా తీవ్రంగా స్పందించారు. ఎంతోమంది నిపుణుల కృషితో ఏర్పాటైన సంస్థను ప్రస్తుత ప్రభుత్వం వివాదాల్లోకి లాగుతోందని విమర్శించారు. ఈ ఆరోపణలపై టీవీకే, సీఎం విజయ్ కార్యాలయం స్పందించలేదు. తమిళనాడు నుంచి గోప్య పెట్టుబడి సమాచారాన్ని పొందడంలో తమ పాత్ర ఉందన్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ తోసిపుచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ ఆరోపణలను ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

