కోత పెట్టిన స్థానంలోనే కొత్త పింఛన్లు!
మూడేండ్లుగా కోతపెట్టిన పింఛన్ల స్థానంలోనే కొత్తవి మంజూరు చేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి పింఛన్ లబ్ధిదారులు 44.7 లక్షల మంది ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మూడేండ్లుగా కోతపెట్టిన పింఛన్ల స్థానంలోనే కొత్తవి మంజూరు చేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి పింఛన్ లబ్ధిదారులు 44.7 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగులకు రూ.4,016, మిగిలిన అన్నీ క్యాటగిరీల వారికి రూ.2,016 చొప్పున అందించేవారు. ఇందుకు ప్రతినెలా రూ.1,200 కోట్లు వెచ్చించేవారు.
గద్దెనెక్కిన ఆరు నెలల్లో డబుల్ పింఛన్లు, మరణించిన లబ్ధిదారుల పేరిట 1.4 లక్షల మందిని, మొత్తంగా 2024లో 1.5 లక్షల మందిని పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఆ తర్వాత 2025లో లైవ్ అథెంటిఫికేషన్, ఫోరెన్సిక్ అడిట్ పేరిట లక్షన్నర లబ్ధిదారులకు కోతపెట్టారు. మరణించినవారితోపాటు వలసవెళ్లిన వారికి పింఛన్లు నిరాకరిస్తూ 1.7 లక్షల మంది చేయూత లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి తొలగించారు. 2026 పంద్రాగస్టు కానుకగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
చివరికి ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19వ తేదీన 4.63 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసి 26వ తేదీ నుంచి నగదు మంజూరు చేస్తామని తాజాగా ప్రకటించారు. 2024-25లో రూ.14,861 కోట్లు కేటాయించగా 2025-26, 2026-27 బడ్జెట్లోనూ అంతే మొత్తంలో కేటాయింపులు చేసింది. పాతవారి స్థానంలో కొత్తవి ఇస్తున్నట్టు బడ్జెట్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. కొత్త పింఛన్ల మంజూరు ప్రహసనంలా మార్చిన సర్కార్ తీరుపై లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతున్నది.
లబ్ధిదారులను మోసం చేయడమే : ఎన్పీఆర్డీ
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కొత్త లబ్ధిదారులకు పింఛన్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి వాయిదావేయడం మోసపూరితమని దివ్యాంగుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మండిపడ్డారు. రూ.6వేల పింఛన్ ఇస్తామని నమ్మబలికి మూడేండ్లయినా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

