హిమాచల్ కాంగ్రెస్ సర్కార్ గంజాయి సాగు
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ పాలనలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు రెండు లైసెన్స్‌లను జారీ చేసింది. నియంత్రిత గంజాయి సాగు కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రెండు లైసెన్స్‌లు జారీ చేసినట్టు ప్రకటించింది.
- సాగుకు రెండు లైసెన్స్‌లు జారీ
- ప్రభుత్వ, రైతుల ఆదాయం కోసమేనన్న సీఎం సుఖు
- మండిపడుతున్న పౌరులు
ధర్మశాల, నవంబర్ 19 : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ పాలనలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు రెండు లైసెన్స్‌లను జారీ చేసింది. నియంత్రిత గంజాయి సాగు కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రెండు లైసెన్స్‌లు జారీ చేసినట్టు ప్రకటించింది. రాష్ట్ర ఆదాయం పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని అధికం చేసేందుకు ఈ సాగును ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొంది. కాంగ్రా జిల్లాలో అనుమతి పొందిన విత్తన సరఫరాదారునికి ఒక లైసెన్స్ జారీ చేయగా, పరిశోధన కోసం సోలన్ జిల్లాలోని నౌని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీకి రెండో లైసెన్స్ ఇచ్చారు. అయితే, ఈ విధానం ద్వారా ఏటా ఎంత ఆదాయం వస్తుందన్న అంచనాను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదు.
మరింత మందికి లైసెన్స్‌లు
ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అనుమతి పొందిన విత్తనాల సరఫరా, క్యానబిస్ సాగు, తయారీ, ప్రాసెసింగ్, నిల్వ, పరిశోధన, విశ్లేషణ వంటి కార్యకలాపాలకు అర్హులైన దరఖాస్తుదారులకు లైసెన్స్‌లు జారీ చేస్తామని సుఖు తెలిపారు. చట్టబద్ధ గంజాయి సాగు ద్వారా ప్రభుత్వ ఆదాయం, సెస్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే జారీ చేయాల్సిన లైసెన్స్‌ల సంఖ్య ఖరారై, వాటిని మంజూరు చేసిన తర్వాతే వాస్తవ ఆదాయాన్ని అంచనా వేయగలమని చెప్పారు. ప్రభుత్వ ఆదాయంతోపాటు రైతుల ఆదాయాన్ని ఎలా పెంచాలన్న అంశంపైనా ఈ చర్చలు జరిగాయని, అనంతరం చట్టబద్ధ, నియంత్రిత గంజాయి సాగు ప్రారంభానికి అవసరమైన విధాన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను అటు విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు, పౌరులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గంజాయి సాగును చట్టబద్ధం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్‌లో ఇంకెన్ని దిగజారుడు నిర్ణయాలు తీసుకుంటుందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

