Harish shankar | హరీష్ శంకర్ (Harish shankar), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా… రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి Aura Of Ustaad సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను ఆదివారం మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో నిర్వహించారు.
ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. డబ్బుకు ఏ మాత్రం లొంగని వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నాడు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత చాలా మంది నిర్మాతలు తమను సినిమా చేయమని, కొన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చి యాడ్స్ చేయమని అడిగారు. 2012లోనే పాన్ ఇండియా అనే టర్మ్ లేదు. షారుక్‌ఖాన్ ప్రకటనలు చేస్తే ఎంత తీసుకుంటారో పవన్ కల్యాణ్‌కు కూడా అంత మొత్తాన్ని ఆఫర్ చేశారు. కానీ కొన్ని ఉత్పత్తులు ఆరోగ్యం కాదని, మరికొన్ని చిన్నపిల్లలకు మంచిది కాదని వద్దనుకున్నారు. పవన్ కల్యాణ్ నా కళ్ల ముందే కోట్ల రూపాయలు వదులుకున్నారు.
హీరో పాత్రను పరిచయం చేసే పాటంటే, ఎవరు ఎలాంటి పదాలు రాసినా అందరి హీరోలకు సరిపోతాయి. కానీ Aura Of Ustaad పాటలోని ప్రతీ పదం కేవలం పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే చంద్రబోస్ రాశారు. సాంగ్‌ను మొత్తం 8 గంటల్లో పూర్తి చేశామని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
“Mi Andaru Release Apudu Paalabhishekam Chesinatu, DSP Gaaru Paatabhishekam Chesharu, Bose Gaaru Thana Ink Tho Sirabhishekam Chesharu”
Watch Director #HarishShankar speech @ #AuraOfUstaad Song Launch Event🔥
Event by @shreyasgroup ✌️… pic.twitter.com/G1ZyWrQz3r
— Shreyas Media (@shreyasgroup) February 22, 2026
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. ఇక ఆ సినిమా ఇప్పట్లో లేనట్టేనట..!
Jai Hanuman | హనుమంతుడి జన్మస్థలంలో గ్రాండ్‌గా మొదలైన ‘జై హనుమాన్’ – రిషబ్ శెట్టితో భారీ సీక్వెల్!
Farmer Registry | ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి..