Beeram Harshavardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బీరం లక్ష్మారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
లక్ష్మారెడ్డి మృతితో బీరం కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నాగర్కర్నూల్ జిల్లా సింగోటంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.