Farmer Registry | ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి..
Farmer Registry | రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు మల్లయ్య సూచించారు.
Farmer Registry | తొగుట, ఫిబ్రవరి 22 : పట్టా పాస్‌బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు మల్లయ్య తెలిపారు. ఆదివారం బండారుపల్లి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే, రైతులకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ కోడ్) కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని చెప్పారు.
భూమి కలిగిన ప్రతి రైతు, తన భూములకు సంబంధించిన అన్ని వివరాలతో ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని సూచించారు.పీఎం కిసాన్ లబ్ధిదారులు తదుపరి విడత నిధులు పొందడానికి కూడా ఈ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని మల్లయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోలా వెంకటస్వామి, ఏఈవో నాగార్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

