హైదరాబాద్ : లారీని బస్సు(RTC bus) ఢీకొట్టడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సిద్దిపేట(Siddipeta) జిల్లా గజ్వేల్ ప్రజ్ఙాపూర్ వద్ద గల ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..