కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మూడు రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
- మెదక్ జిల్లా చేగుంటలో ఫలహార బండి ప్రారంభం
చేగుంట, ఆగస్టు 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మూడు రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చేగుంట సర్పంచ్ అభ్యర్థి దుంపల రమ్యాడిష్రాజు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఫలహార బండిని కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమం కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారన్నారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని,తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గుడికట్టుకున్నాడన్నారు. గోదావరి జలాలను ఇక్కడికి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఉప కాల్వలు పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోబీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోమండ్ల నారాయణరెడ్డి,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు,బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, మాజీ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, మమ్మద్ అలీ, శ్రీకాంత్, ఎర్ర యాదగిరి, సోమ సత్యనారాయణ, మహేశ్, పులబోయిన రవి, సంపత్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గ్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

