హైదరాబాద్, సెప్టెంబర్ 16: అంతర్జాతీయ దిగ్గజం ఈబీజీ గ్రూపు తాజాగా దేశీయ బొమ్మలు, ఆటల వస్తువుల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఇందుకోసం తన తొలి స్టోర్‌ను ఈ ఏడాది చివర్లో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ఈబీజీ గ్రూపు ఫౌండర్, చైర్మన్ ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు. అధిర అండ్ అప్పా టాయ్స్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్టోర్లలో వెయ్యికి పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా బొమ్మలు, ఆటల వస్తువులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది చివరినాటికి రూ.50 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 50కి పైగా స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు.