దుబాయ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సెంచరీ కొట్టిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer).. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. 43 బంతుల్లో 102 రన్స్ చేసిన అయ్యర్.. టీ20ల్లో ప్రస్తుతం ఏడవ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరో వైపు వన్డే కెప్టెన్ శుభమన్ గిల్.. ఆ ఫార్మాట్ బ్యాటింగ్ పొజిషన్లో టాప్‌లో ఉన్నాడు. తొలి టీ20లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ ఏకంగా 18 స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. ఆ ఫార్మాట్లో బెస్ట్ ర్యాంక్ సాధించిన మూడవ భారత బ్యాటర్‌గా నిలిచాడు. టీ20ల్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తిలక్ వర్మ 10వ స్థానంలో నిలిచాడు. టాప్-10 స్థానాల్లో నలుగురు భారత బ్యాటర్లు ఉండడం గమనార్హఃం. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 8 స్థానాలు ఎగబాకి 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
A rankings first for India’s inspirational skipper following his heroics against the West Indies in Lucknow 🔥
Read more 👇
https://t.co/b3U80YakJ9— ICC (@ICC) October 7, 2026