న్యూఢిల్లీ: కారు నడిపిన ఒక మహిళ, రోడ్డుపై నడుస్తున్న వృద్ధ దంపతులను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఆ మహిళ కారు నుంచి కిందకు దిగింది. ఆ వృద్ధ దంపతులు బతికి ఉన్నారో లేదోనని పరిశీలించింది. ఆ తర్వాత కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. (Woman Hits Elderly Couple With Car) శుక్రవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్ ఆర్య సమాజ్ మందిరం సమీపంలో హ్యుందాయ్ క్రెటా వేగంగా దూసుకువచ్చింది. రోడ్డు పక్కన నడుస్తున్న 70 ఏళ్లు పైబడిన వృద్ధ దంపతులను కారు నడుపుతున్న మహిళ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
కాగా, కారు నడిపిన మహిళ కిందకు దిగాలా వద్దా అని కొంతసేపు ఆలోచించింది. కారు డోర్ తెరిచి మూసింది. కొన్ని క్షణాల తర్వాత కారు నుంచి బయటకు వచ్చింది. గాయపడిన ఆ వృద్ధ దంపతులను ఆ మహిళ పరిశీలించింది. వారు బతికి ఉండటంతో ఆ మహిళ తన చేతులు జోడించి దేవుడికి కృతజ్ఞతలు తెలిపింది. స్థానికులు ఆ వృద్ధ దంపతులను పైకి లేపి సపర్యలు చేస్తుండగా ఆ మహిళ మెల్లగా జారుకున్నది. కారు ఎక్కి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయింది.
మరోవైపు రోడ్డుపై బోర్లా పడటంతో వృద్ధుడి ముఖం, తలకు గాయాలయ్యాయి. ఆయన భార్య కూడా గాయపడింది. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ వృద్ధ దంపతులను 79 ఏళ్ల దయానంద్, 71 ఏళ్ల కుసుమ్గా గుర్తించారు. వారి ఇద్దరు పిల్లలు అమెరికాలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
ఆ వృద్ధ దంపతులను కారుతో ఢీకొట్టిన మహిళను 49 ఏళ్ల నవలీన్ కౌర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అజాగ్రత్తగా వాహనం నడపడం, గాయాలకు కారణం కావడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पश्चिम दिल्ली के कीर्ति नगर में एक क्रेटा कार ने एक 71 वर्षीय महिला और उनके 79 वर्षीय पति को जोरदार टक्कर मार दी.
इस हादसे में बुजुर्ग दंपत्ति गंभीर रूप से घायल हो गए. पुलिस ने गाड़ी चला रही महिला को गिरफ्तार कर लिया है. https://t.co/13wlIgECwt— Ruby Arun रूबी अरुण (@arunruby08) October 3, 2026