కాంగ్రెస్ నేతల దౌర్జన్యం!
కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
- కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం
- ప్రతిఘటించిన బీఆర్ఎస్ శ్రేణులు, 63వ జాతీయ రహదారిపై ధర్నా
- జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్తత
మెట్పల్లి, నవంబర్17: కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా డా.కల్వకుంట్ల సంజయ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపై గళమెత్తడం, రైతుల పక్షాన చివరి దశలో ఉన్న పొలాలకు నీరందించేందు కు ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు, సదర్మాట్ బరాజ్ నుంచి గంగనాల ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేయడంలో ప్రత్యేకంగా కృషి చేయడం, మెగా జాబ్ మేళా నిర్వహించి 750 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం తదితర పనులకు ప్రజల్లో మంచి పేరు వస్తుండటంతో జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై కక్షగట్టారు.
ఇద్దరు మున్సిపల్ కార్మికులను తన సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలకు దిగి.. నిరసన పేరుతో ఏకంగా ఎమ్మెల్యే ఇంటి వైపు దూసుకుపోయి దౌర్జన్యానికి దిగా రు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన గంటల వ్యవధిలోనే బయటకు వచ్చి రోడ్డెక్కడం, ఎమ్మెల్యే ఇంటి వైపు దూసుకురావడం కలకలంరేపింది.
మూకుమ్మడిగా ఎమ్మెల్యే ఇంటి వైపు వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను మార్గమధ్యంలో పోలీసులు నియంత్రించారు. కాంగ్రెస్ నాయకుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్‌స్టాండ్ సమీపంలో 63వ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీ ఎత్తి.. బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాల జోలికి వెళ్లకుండా సహనం పాటించాలని ఎమ్మెల్యే సూచించడంతో బీఆర్ఎస్ శ్రేణులు శాంతించారు.
చిల్లర రాజకీయాలు: ఎమ్మెల్యే సంజయ్
వేరే నియోజకవర్గం నుంచి వచ్చి గొడవలు సృష్టిస్తున్న పరాన్నజీవుల నుంచి కోరుట్ల ని యోజకవర్గాన్ని బాధ్యతతో కాపాడుకుందామ ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీకి చెందిన పరాన్న జీవులు చేస్తున్న చిల్లర రాజకీయాల జోలికి పోకూడదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, కోరుట్లలో గడీబురుజులను కాపాడుకోవడం, మెట్పల్లిలో పెద్ద చెరువును రక్షించుకోవడం, మున్సిపల్లో అరాచకాలను అరికట్టడం, మహిళలకు పెన్షన్ల కోసం, పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
దాడి అప్రజాస్వామికం : టీ జీవన్‌రెడ్డి
సంజయ్ ఇంటిపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక భయబ్రాంతులకు గురిచేసేలా దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

