బీఆర్ఎస్ గిరిజన సర్పంచ్‌పై దాడి
ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి సమక్షంలోనే బీఆర్ఎస్ గిరిజన సర్పంచ్‌పై దాడి జరిగిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది.
- ఎమ్మెల్యే సమక్షంలోనే కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం
- జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత
పాలకుర్తి, నవంబర్ 17 : ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి సమక్షంలోనే బీఆర్ఎస్ గిరిజన సర్పంచ్‌పై దాడి జరిగిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది. సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలకుర్తిలో చేయూత పింఛన్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లు లేకుండా పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారని గుడికుంట తండా సర్పంచ్ మహేందర్ ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రె స్ నాయకులు సర్పంచ్‌పై దాడిచేశారు.
దాడి ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవా రం పాలకుర్తిలో రోడ్డెక్కారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఉసిగొల్పడం వల్లే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. రాజీవ్ చౌరస్తాకు ర్యాలీ గా వచ్చి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

