ఎండిన వరి పైరుకు నిప్పు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుండగా, కడుపు మండిన రైతులు వినూత్న నిరసనకు దిగారు. మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ శివారుకు చెందిన రైతులు వరి పైరుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 28వ డిస్ట్రిబ్యూటరీ కాలువ చివరి ఆయకట్టుకు సాగు నీరందక పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నర్సాపూర్‌కు చెందిన సిరిపురం తిరుపతి, తొట్ల సత్తన్న 2 ఎకరాలు వరి సాగుచేశారు.
- మంచిర్యాల జిల్లాలో రైతుల నిరసన
దండేపల్లి, నవంబర్ 17 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుండగా, కడుపు మండిన రైతులు వినూత్న నిరసనకు దిగారు. మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ శివారుకు చెందిన రైతులు వరి పైరుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 28వ డిస్ట్రిబ్యూటరీ కాలువ చివరి ఆయకట్టుకు సాగు నీరందక పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నర్సాపూర్‌కు చెందిన సిరిపురం తిరుపతి, తొట్ల సత్తన్న 2 ఎకరాలు వరి సాగుచేశారు.
మామిడి రాజన్న, మిల్కూరి వెంకటేశ్ 2 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశారు. నీరందక నెర్రెలు బారి పంట పూర్తిగా ఎండిపోయింది. పంట చేతికొచ్చే దశలో ఎండిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కడెంలో నీళ్లున్నా అధికారులు సకాలంలో వదలకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

