ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి
కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరువు పీడిత రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున సహాయం అందిస్తున్నారని, ఇక్కడ మాత్రం రేవంత్ సర్కార్ ఇప్పటికీ పంట నష్టం అంచనా కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.
- రైతులు, ప్రజలను సత్వరం ఆదుకోవాలి
- ఎకరాకు 10 వేల పరిహారం ఇవ్వాలి
- వడ్ల కొనుగోలుపై విధివిధానాలు ఖరారు చేయాలి: హరీశ్‌రావు
- సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌లో కొనుగోలు కేంద్రాల సందర్శన
నారాయణఖేడ్, నవంబర్ 17: కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరువు పీడిత రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున సహాయం అందిస్తున్నారని, ఇక్కడ మాత్రం రేవంత్ సర్కార్ ఇప్పటికీ పంట నష్టం అంచనా కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వడగండ్ల వాన, తుపాన్ సందర్భాల్లో పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేల చొప్పున సహాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎటువంటి విధివిధానాలను ఖరారు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను అరిగోస పెడుతుందని దుయ్యబట్టారు. వెంటనే సన్నాలకు బోనస్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో రైతుల్లో భరోసా నింపేందుకు వెంటనే రైతుబంధును విడుదల చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రైతుబీమా మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ బీమా పేరిట రేవంత్ ప్రభుత్వం తెస్తున్న కొత్త బీమా పథకం సహేతుకంగా లేదని తెలిపారు. రైతుబీమా ద్వారా తమ ప్రభుత్వం కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ బీమాను అమలు చేయగా, ఇందిరమ్మ బీమా ద్వారా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేయడం సరికాదని అన్నారు. ఎగొట్టే పథకాలకు మాత్రమే ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ పేర్లు పెడుతున్న రేవంత్‌రెడ్డి ఆయా పథకాలకు తన పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. నిజాంసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల ద్వారా రివర్స్ పంపింగ్ చేసి సింగూర్‌లో నీటిని నింపితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
అనంతరం హరీశ్‌రావు నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేట్లోని శ్రీలక్ష్మీ అనంతశయనస్వామి ఆలయం ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణఖేడ్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాములు చిస్తీని కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నారాయణఖేడ్, అందోల్ మాజీ ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

