తిరుమల : ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు పదిరోజుల పాటు తిరుమల ( Tirumala ) లో పలు దర్శనాలను టీటీడీ రద్దు ( Darshans cancell ) చేసింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్స వాలు సందర్భంతోపాటు పెరటాసి మాసం చివరి వారం కావడంతో భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ దర్శనాలను రద్దు చేశారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి అక్టోబర్ 10వ తేదీ నుంచి 19వ తేది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.