అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ( AP Cabinet) కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandara Babu ) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan ) తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో 12 అజెండా అంశాలకు ( Agenda Items ) ఆమోదం తెలిపింది.
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రస్థానంపై అభినందనలు తెలియజేస్తూ మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హర్టీకల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు ప్రతిపాదనకు, రేపల్లె 30 పడకల సీహెచ్‌సీని 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడేషన్ కు రూ. 58.42 కోట్లు కేటాయిస్తూ అదనంగా 66 పోస్టుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
2026-27 తల్లికి వందనం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల పెంపు ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది. విశాఖ మారికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోచింగ్ కేంద్రం ఏర్పాటుకు , ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.