హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఎలక్ట్రిక్ మొబిలిటీ సేవల సంస్థ బైక్‌వో..మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన బయో ఎనర్జీ విభాగం నుంచి రూ.66.46 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పందంతో కంపెనీ మైలురాయిలో ఇదొక కీలక ఘట్టమని, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ప్రత్యేక అప్లికేషన్లు, నిర్వహణ కార్యకలాపాలు ఒకేచోట చేర్చడానికి సంస్థ కీలక పాత్ర పోషించనున్నదని పేర్కొంది.