జహీరాబాద్, ఫిబ్రవరి 22 : మోదుగు పువ్వు.. దీని గురించి తెలియని వారుండరు. ఔషధ గుణాలున్న ఈ పువ్వును ప్రత్యేకించి హోలీ పండుగ సమయంలో ఎక్కువగా వినియోగించేవారని తెలిసిందే. అయితే క్రమంగా సహజసిద్దమైన రంగుల వాడకం తగ్గించి.. రసాయన రంగుల వాడకం పెరిగిపోవడంతో హోలీ పండుగకు మోదుగు పూల వినియోగం తగ్గుతూ వస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, జహీరాబాద్ మొగుడంపల్లి మండలాల్లోని ప్రధాన రహదారుల వచ్చి పొయ్యే బాటసారులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఓ మోదుగు చెట్టు విరబూసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
విరబూసిన కుసుమాలతో గ్రామీణ ప్రాంతానికి వన్నె తెస్తున్న ఈ దృశ్యం న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయక ఆలయ ముఖద్వారం సమీపంలోనీ జహీరాబాద్- బీదర్ ప్రధాన రోడ్డు పక్కన విరబూసిన మోదుగు చెట్టు ఉన్న పూలు కనువిందు చేస్తూ చూపరులను కట్టిపడే స్తుంది. ఎన్నో ఔషద గుణాలున్న మోదుగు పూలకు ఆదరణ తగ్గినా.. నాటి తరం వాళ్లు మోదుగు పువ్వులను చూసినప్పుడు తీపి గుర్తుగా కొన్ని పువ్వులను వెంట తెచ్చుకుంటున్నారు.