హైదరాబాద్ : మెదక్(Medak) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హతమార్చి నగలతో పరారయ్యాడు. ఈ విషాదకర సంఘటన చేగుంట(Chegunta) రైల్వే స్టేషన్ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరలక్ష్మి(36) త్రిమూర్తి దంపతులు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనుక నివిస్తున్నారు. గత కొద్ది రోజులుగా భర్య,భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శనివారం రాత్రి త్రిమూర్తి భార్య వరలక్ష్మిని కత్తితో గొంతుకోసి నగలు తీసుకొని పరారయ్యాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.