Jai Hanuman | హనుమంతుడి జన్మస్థలంలో గ్రాండ్‌గా మొదలైన ‘జై హనుమాన్’ – రిషబ్ శెట్టితో భారీ సీక్వెల్!
Jai Hanuman | విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా 'జై హనుమాన్' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి.
Jai Hanuman | విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ‘జై హనుమాన్’ చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ భారీ సీక్వెల్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గత ఏడాది కాలంగా రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ వంటి ఇతర పరిణామాల వల్ల ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ, నేటి పూజా కార్యక్రమాలతో పనులు అధికారికంగా ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తుండగా, రానా దగ్గుబాటి ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. మొదటి భాగం హీరో తేజ సజ్జా కూడా ఈ సినిమాలో భాగం కావడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ప్రారంభం కానుంది. మొదటి భాగం కంటే విజువల్స్ పరంగా అద్భుతంగా ఉండేలా ‘అంజనాద్రి 2.0’ పేరుతో సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధం చేస్తున్నారు. భక్తి, యాక్షన్ కలగలిపి ఈ చిత్రాన్ని అద్భుత దృశ్యకావ్యంగా మలిచేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Anjanadri
- Hampi
- hanuman
- jai hanuman
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

