Chinese rocket : చైనా ప్రయోగించిన ఒక రాకెట్ ప్రయోగం విఫలమైంది. రాకెట్ ప్రయోగించిన 85 సేకండ్లలోనే గాలిలో పేలిపోయింది. ఈ ఘటన సోమవారం రాత్రి దక్షిణ చైనాలో జరిగింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. లాంగ్ మార్చ్ 7 అనే ఈ రాకెట్‌ను వెంచాంగ్‌లోని స్పేస్ లాంఛ్ సైట్ నుంచి రాత్రి 8.02 గంటలకు ప్రయోగించారు. ఇది చైనాశాట్-4బీ అనే శాటిలైట్‌ను మోసుకెళ్లింది. అయితే, ప్రయోగించిన 85వ సెకండ్‌కు ఈ రాకెట్ పేలిపోయింది. అక్కడికి దగ్గర్లోని సముద్ర తీర ప్రాంతంలో కూలిపోయినట్లు తెలుస్తోంది.
దీనిపై చైనా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాకెట్ పేలడానికి, ప్రయోగం విఫలం కావడానికి గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ రాకెట్ ప్రయోగం గురించి ముందుగా స్థానిక మీడియా వెల్లడించింది. కానీ, ప్రయోగం విఫలమైన తర్వాత నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడి చాలేదు. లాంగ్ మార్చ్ 7ఏ రాకెట్లను చైనా 2020 నుంచి ప్రయోగిస్తోంది. అప్పట్లో జరిపిన తొలి ప్రయోగం కూడా విఫలమైంది.
WATCH: China’s Long March 7A rocket explodes seconds after launch pic.twitter.com/6kfUzKJoSz
— Rapid Report (@RapidReport2025) August 10, 2026
తర్వాత మళ్లీ ఇదే రాకెట్‌ను తిరిగి 2021లో ప్రయోగించగా సక్సెస్ అయింది. అప్పటినుంచి అనేకసార్లు లాంగ్ మార్చ్ 7ఏ రాకెట్లను చైనా ప్రయోగిస్తోంది. శాటిలైట్లను జియోసింక్రనస్ ఆర్బిట్‌లో ప్రయోగించేందుకు చైనా వీటిని వినియోగిస్తోంది. గతంలో చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 3బీ రాకెట్ స్థానంలో వీటిని ప్రయోగిస్తోంది.