Renu Desai | అసభ్యకర కామెంట్స్‌పై రేణు దేశాయ్ ఫైర్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరిక
Renu Desai | సీనియర్ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితం, పిల్లలతో గడిపే క్షణాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఇటీవల తనపై వస్తున్న అసభ్యకర కామెంట్స్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేస్తూ తన ఆవేదనను వెల్లడించారు.
Renu Desai | సీనియర్ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితం, పిల్లలతో గడిపే క్షణాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఇటీవల తనపై వస్తున్న అసభ్యకర కామెంట్స్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేస్తూ తన ఆవేదనను వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు చాలానే సహించాను. ఇకపై ఎవరు తప్పుగా మాట్లాడినా వదిలేది లేదు. సైబర్ పోలీసులు వారి వివరాలు కనుక్కొని చర్యలు తీసుకునేలా చూస్తాను” అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి ఉన్న హక్కులు తనకూ ఉన్నాయని, తాను కూడా ఒక సాధారణ భారతీయురాలినేనని చెప్పారు.
తాను కాశీకి వెళ్లి దేవి వేషధారణలో ఫోటో పోస్ట్ చేస్తే, కొందరు “రాత్రికి రేటెంత?” అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. “ఇది ఏ సంస్కారం? ఒక మహిళ అమ్మవారి దుస్తుల్లో ఉంటే కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?” అని ప్రశ్నించారు. పబ్లిక్ ముందు వచ్చి తిట్టమని సవాల్ విసిరినా, దానివల్ల ఎవరికి లాభముంటుందని నిలదీశారు. కుక్కలను హింసించొద్దని చెప్పినందుకు ఇప్పటికీ తనపై దూషణలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కొన్ని ఎన్జీవోల ఆహ్వానం మేరకు కుక్కల సంరక్షణపై జరిగిన కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. జంతువులను దారుణంగా చంపేస్తున్నారని బాధతో స్పందించానని, కానీ తన మాటలను వక్రీకరించి తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
విడాకుల తర్వాత నుంచి తన వ్యక్తిగత జీవితంపై కూడా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. భరణం తీసుకున్నానని, రాజకీయ పార్టీలకు బానిసనని ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నా గురించి కామెంట్ చేయడానికి ఏమీ మిగల్లేదనుకున్నాను, కానీ ఇంకా చెత్తగా మాట్లాడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్ సంస్కృతి పై ఆమె గట్టిగా స్పందించడం చర్చనీయాంశమైంది. మహిళలపై, ముఖ్యంగా సెలబ్రిటీలపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులపై మరింత కఠిన చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

