కాంగ్రెస్‌ది అరాచక పాలన
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అరాచక పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు హైడ్రా పేరిటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు 22ఏ చట్టం తెచ్చి లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల ఉసురు తీసుకుంటున్నదని విమర్శించారు.
- హైడ్రా పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతున్నది
- 22ఏలో భూములు నిషేధిత జాబితా పెట్టి ప్రజలు వేధిస్తున్నది
- కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తథ్యం
- ప్రజావాణి పేరిట హంగామా చేయడం మరిచి గ్రామాలకు నిధులివ్వాలి
- మీడియాతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, ఆగస్టు 14: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అరాచక పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు హైడ్రా పేరిటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు 22ఏ చట్టం తెచ్చి లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల ఉసురు తీసుకుంటున్నదని విమర్శించారు. 22ఏ పేరిట అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు.
అనేక మంది రైతులు, ప్రజలు తమ భూములు విక్రయించుకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూడేండ్ల కాం గ్రెస్ పాలనలో ప్రజలు భద్రతా భావనతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాగ్రహానికి గురై కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడుతున్నారని, దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇంతవరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. మండలాల్లో ప్రజావాణి పేరిట ప్రభుత్వం ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టరేట్ల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కరించారానికి నోచుకోవడం లేదన్నారు.
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ఎంపీడీవోల వద్ద నిధులు లేవన్నారు. దుబ్బా క చేనేత కార్మికులకు ఆసరా పింఛన్ మం జూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దుబ్బాక సొ సైటీలో 1500 మంది చేనేతలుంటే, వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే పింఛన్ మంజూరు చేస్తామని అధికారులు చెప్పడం సరికాదన్నారు. యూరియా కోసం యాప్‌ల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని విమర్శించారు. కలెక్టర్, అధికారులు దుబ్బా క నియోజకవర్గంపై చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఏ ఒక్క ఆర్డీవో దుబ్బాకకు రావడం లేదన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

