Iran Revolutionary Guard | అమెరికా(America), ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్(Iran )సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ(Khamenei )మృతితో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరాన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ఓ వైపు ప్రకటిస్తుండగా.. ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యపై మండిపడుతున్నది. ఖమేనీ మృతిని ఇరాన్ కేబినేట్ తీవ్రంగా ఖండించింది. ఆయన మరణం మహా నేరంగా అభివర్ణించింది. ఖమేనీ హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ స్పష్టం చేసింది.
పవిత్ర రంజాన్ మాసంలో దుష్ట ఉగ్రవాదుల దాడిలో ఖమేనీ మృతి చెందాడు. అమెరికా స్థావరాలపై భీకర దాడులకు పాల్పడుతామని హెచ్చరించారు. దీంతో ఇప్పట్లో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు తొలగిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధ్రృవీకరించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మరణించినట్లు వివరాలను వెల్లడించింది.