బాంచెన్ కాల్మొక్తా.. యూరియా ఇయ్యండ్రి
యూరియా కోసం ఓ రైతు సహకార సంఘం నిర్వాహకుల కాళ్లపై పడి వేడుకున్న ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో చోటుచేసుకున్నది.
- మెదక్ జిల్లా రంగంపేట సొసైటీ వద్ద అటెండర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు
కొల్చారం, ఆగస్టు 12: యూరియా కోసం ఓ రైతు సహకార సంఘం నిర్వాహకుల కాళ్లపై పడి వేడుకున్న ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో చోటుచేసుకున్నది. చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు బోయిని రాములు ఎకరం పొలంలో వరినాటు వేశాడు. చిలిపిచెడ్ మండలంలో యూరియా దొరుకలేదు. అతడు చదువుకోలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్‌పై ఏ మాత్రం అవగాహన లేదు. ఎలాగైనా యూరియా సంపాదించాలని బుధవారం చిట్కుల్ సమీపంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి చేరుకున్నాడు. రూ.900 ఒక యూరియా బస్తా చొప్పున రెండు ఇప్పించాలని అక్కడే కుర్చీలో కూర్చున్న సహకార సంఘం అటెండర్ కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. రైతు ఆవేదన చూసిన తోటి రైతులు సైతం చలించిపోయారు. బాధిత రైతుకు యూరియా బస్తాలు ఇప్పించాలని తోటి రైతులు సహకార సంఘం నిర్వాహకులను కోరారు. ఒకవేళ యూరియా బస్తాలు మిగిలితే చూద్దామని నిర్వాహకులు చెప్పినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- farmer
- Medak District
- urea
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

