US-Israel-Iran War | అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఇరాన్లో 40 మంది విద్యార్థులు మృతి
US-Israel-Iran War | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అయితే మినాబ్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలపై క్షిపణులు పడ్డాయి. ఈ పేలుడులో సుమారు 40 మంది విద్యార్థినులు మరణించారు. మరో 45 మంది బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అయితే మినాబ్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలపై క్షిపణులు పడ్డాయి. ఈ పేలుడులో సుమారు 40 మంది విద్యార్థినులు మరణించారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. (US-Israel-Iran War) దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో ఉన్న మినాబ్‌లో ఇరాన్ పారామిలిటరీ దళం రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన మిలటరీ బేస్ ఉన్నది. దీని లక్ష్యంగా జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో బాలికల స్కూల్ ధ్వంసమైనట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్ వాణిజ్య నగరం టెల్అవివ్పై క్షిపణులతో విరుచుకుపడింది. అలాగే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. బహ్రెయిన్, అబూదాబీ, ఖతార్, కువైట్, ఇరాన్‌లోని అమెరికా ఆర్మీ, నేవీ బేస్‌లను ఇరాన్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దుబాయ్‌లో మరో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు గల్ఫ్ ప్రాంతంలో మరో భారీ స్థాయి యుద్ధానికి దారితీస్తున్నాయి.
Also Read:
Iran Attacks | మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న ఇరాన్.. యూఏఈ, ఖతార్, సౌదీలపై దాడులు
Iran: 7 మిస్సైళ్లతో ఖమేనీ నివాసంపై దాడి.. సైనిక ఆపరేషన్‌పై ట్రంప్ వీడియో సందేశం
Israel | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. భారతీయులకు కేంద్రం కీలక సూచనలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

