చీకటిని చీల్చిన సంకల్ప జ్వాల
తమస్సును తరిమేయాలి అంధకారాన్ని అంతం చేయాలి. అణచివేతల చీకటి గుహల్లో ఆత్మగౌరవ దీపాలు వెలిగించాలి.
తమస్సును తరిమేయాలి
అంధకారాన్ని అంతం చేయాలి.
అణచివేతల చీకటి గుహల్లో
ఆత్మగౌరవ దీపాలు వెలిగించాలి.
చీకటికి అంతం సత్యాగ్రహమే,
అన్యాయానికి సమాధానం ధర్మాగ్రహం.
ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలిచే
అస్తిత్వపు అగ్నిపతాక దీక్ష.
తెలంగాణ నెత్తిన
పెత్తందారుల దౌర్జన్యం..
భూమిని కబళించిన భూస్వామ్యం..
బతుకుల్ని ఛిద్రం చేసిన ఆధిపత్యం..
హక్కుల్ని హరించిన కుట్రలు..
చీకటిని చీల్చడానికి
సంకల్పం కదిలింది.
నాయకుడు నిలబడ్డాడు.
జాతి గొంతుకై
దీక్షకు పూనుకున్నాడు.
అదొక ఆకలి పోరాటం
మాత్రమే కాదు,
అది ఆత్మగౌరవ ప్రకటన.
అది వ్యక్తిగత పంతం కాదు,
అదొక జాతి విముక్తి సంకల్పం.
ఆధిపత్యాలు, అహంకారాలు…
బహుళ రూపాల్లో ఎదురొచ్చినా
సంకల్పం తలవంచలే!
దశాబ్దాల దుఃఖానికి
విముక్తి వాక్యం పలుకాలంటే
తెలంగాణ తల్లి ముఖాన
వెలుగు నవ్వులు పూయాలంటే
ధర్మదీక్ష వెలుగాలి!
అదొక దీక్షా జ్వాల,
అదొక జ్వాలా ఉద్యమం,
ఆ ఉద్యమం ఒక చరిత్ర,
ఆ చరిత్రలో
ఒక సంకల్ప సంతకం.
ఆకలి అగ్నిలో
ఆత్మగౌరవాన్ని వెలిగించి
నిర్బంధాల నడుమ
నిరసన దీపాన్ని నిలబెట్టి
ఆకాంక్షకు
దేశ రాజధాని సాక్షిగా
సత్యాగ్రహ శంఖం పూరించాడు.
అమరుల త్యాగాల స్మరిస్తూ
ప్రజల పోరాటాల అండతో
దీక్షాదీపం దిక్సూచిగా మారి
విజయానికి బాట వేసింది.
అమరదీక్ష…
అనంతర చరిత్రకు అంకురం.
ధర్మదీక్ష…
అస్తిత్వానికి దిక్సూచి.
సంకల్ప దీక్ష…
స్వరాష్ర్టానికి శుభసూచిక.
దీక్ష ఎంత కఠినమైతేనేం…
జాతి సంకల్పం ముందు
అధికార అహంభావ
అహంకారం కూలిపోతుంది.
అమరదీక్ష
అగ్నిజ్వాల కావాలి.
ఆ అగ్నిజ్వాల
విజయదీపం కావాలి.
తెలంగాణ గుండెల్లో
ఆత్మగౌరవ దీపం వెలగాలి.
-వనపట్ల సుబ్బయ్య ,94927 65358
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

