Operation Epic Fury: ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుపెట్టిన అమెరికా.. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్‌లపై ఇరాన్ దాడి
Operation Epic Fury: ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని అమెరికా పేరు పెట్టింది. మరో వైపు బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ప్రతిదాడికి దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడి చేసింది.
న్యూయార్క్: ఇరాన్‌పై చేసిన దాడులకు అమెరికా రక్షణ శాఖ పేరు పెట్టింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ(Operation Epic Fury) చేపట్టినట్లు పేర్కొన్నది. రక్షణశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ తన ఎక్స్ అకౌంట్లో ఈ పోస్టు చేసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని ట్యాగ్‌లైన్ రాసి అమెరికా జెండా ఎమోజీని పోస్టు చేసింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా పేర్కొన్నది. శనివారం ఉదయం అకస్మాత్తుగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడలు చేసింది. సుప్రీం నేత ఖమేనీ నివాసం, ఆఫీసుపై క్షిపణి అటాక్ జరిగింది. అయితే గత ఏడాది ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలపై కూడా అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడులకు ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
OPERATION EPIC FURY 🇺🇸
— Department of War 🇺🇸 (@DeptofWar) February 28, 2026
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు తెలుస్తోంది. డజన్ల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. డజన్ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించినట్లు నౌర్ న్యూస్ పేర్కొన్నది. ఇజ్రాయెల్‌ను ఉద్దేశిస్తూ యావత్ పాలస్తీనాను టార్గెట్ చేసి క్షిపణులు ప్రయోగించినట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. ఇరాన్‌కు చెందిన ఇంగ్లీష్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ తన కథనంలో సుమారు 75 క్షిపణుల వరకు ఇరాన్ వదిలినట్లు పేర్కొన్నది.
అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బహ్రెయిన్, అబూదాబీ, ఖతార్‌లో ఉన్న అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ ప్రదేశాల్లో ఇవాళ పేలుళ్లు జరిగాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ ఇవాళ తమ పౌరులను కోరింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. అయితే రెండు క్షిపణలను తిప్పికొట్టినట్లు ఇవాళ ఖతార్ ప్రకటించింది. తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన ఆ క్షిపణులను కూల్చినట్లు ఖతార్ అధికారులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

