Vaibhav Sooryavanshi | 15 ఏళ్లకే ఐదు బ్రాండ్లకు అంబాసిడర్.. వైభవ్ సంపాదన ఎంతంటే..?
ఇటీవలే ఇంగ్లండ పర్యటనతో ఇంటర్నేషనల్ టీ20ల్లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు బ్రాండ్ అంబాసిడర్‌గా భారీగా ఆర్జిస్తున్నాడు.
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ సంచలనంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) సంపాదనలోనూ అదరహో అనిపిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ పర్యటనతో ఇంటర్నేషనల్ టీ20ల్లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador)గా భారీగా ఆర్జిస్తున్నాడు. 15 ఏళ్లకే 5 రకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా నియమితుడైన వైభవ్.. ఏటా కోట్లు కొల్లగొడుతున్నాడు.
చిన్నవయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్ధలు కొట్టిన ఈ పిల్లాడు.. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గానూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్ అనంతరం.. వైభవ్ కోసం బ్రాండ్లు క్యూ కట్టాయి. దాంతో, అతడు తన బ్రాండ్ వాల్యూను రూ.కోటికి పెంచేశాడు. ప్రస్తుతం ఐదు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఈ కుర్రాడు.. బీసీసీఐ మ్యాచ్ ఫీజు, ఐపీఎల్ ఫీజు కలిపి మొత్తంగా రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ఆర్జిస్తున్నాడు.
కంప్లాన్: పోషకాలతో నిండిన పాల ఉత్పత్తి కాంప్లాన్(Complan)కు వైభవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. తోడా ప్లాన్.. తోడా కంప్లాన్ అంటూ వైభవ్ చెప్పే డైలాగ్‌తో ఈ యాడ్ బాగా పాపులరైంది. 2026 ప్రారంభంలోనే వైభవ్‌ను తమ ప్రచారకర్తగా తీసుకుంది కంప్లాన్. చిన్నారులను లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రకటనతో వైభవ్ అరకోటిపైనే సంపాదిస్తున్నాడు.

ఎస్ఎస్ బ్యాట్స్ (సరీన్ స్పోర్ట్స్) : బ్యాటుతో విధ్వంసం సృష్టించే వైభవ్ ఎస్ఎస్ బ్యాట్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. తమ బ్యాండ్ బ్యాటు ఉపయోగిస్తున్నందుకు అతడికి ఏటా రూ.50 చెల్లిస్తోందీ సంస్థ. వైభవ్‌కు ఉన్న ఇమేజ్ను సొమ్ము చేసుకోవాలని ఇటీవలే వైభవ్ సూర్యవంశీ ఎడిషన్ బ్యాట్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది కంపెనీ.
గూగుల్ పే: యూపీఐ పేమెంట్లకు సంబంధించిన గూగుల్ పే(Google Pay) యాప్ ప్రచారకర్తగా వైభవ్ కొనసాగుతున్నాడు. ఈ యాడ్‌లో అతడు తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు యూపీఐ అనుసంధానం చేస్తాడు. టీనేజ్ పిల్లలకు సురక్షితంగా డబ్బు నిర్వహణ తెలియజేయడం ఈ యాడ్ ఉద్దేశం.
🔴VAIBHAV SOORYAVANSHI’S BRAND VALUE IS SKYROCKETING AT JUST 15🤯
– Vaibhav estimated net worth is now ₹7–10 crore, with his IPL salary, match fees and brand endorsements contributing to his wealth.
– At just 15, he has already endorsed SS Bats, Complan, Google Pay, Red Bull… pic.twitter.com/zY3U2SBUuY
— Sam (@cricsam02) August 11, 2026
రెడ్ బుల్: ఎనర్జీ డ్రింక్ అయిన రెడ్ బుల్(Red Bull)కు వైభవ్ బ్రాండ్ అంబాసిడర్. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సహచరుడు ధ్రువ్ జురెల్(Dhruv Jurel)తో కలిసి ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడీ చిచ్చరపిడుగు. ఈ ప్రకటనలో వైభవ్, జురెల్ ఇద్దరూ.. రెడ్ బుల్ చాలెంజ్ పెట్టుకుంటారు. 30 బంతుల్లో 60 పరుగులు చేయడమే ఈ ఛాలెంజ్.
ఝార్ఖండ్ ఆరోగ్య విభాగం: చిన్నవయసులోనే క్రికెటర్‌గా రాణిస్తున్న వైభవ్‌ను తమ రాష్ట్ర ఆరోగ్య విభాగానికి అంబాసిడర్‌గా నియమిస్తామని ఝార్ఖండ్ మంత్రి చెప్పారు. వైభవ్ స్ఫూర్తితో రాష్ట్రంలోని యువతరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చూడడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

