Iran: 7 మిస్సైళ్లతో ఖమేనీ నివాసంపై దాడి.. సైనిక ఆపరేషన్‌పై ట్రంప్ వీడియో సందేశం
Iran: ఇజ్రాయెల్ ఇవాళ అకస్మికంగా ఇరాన్‌పై దాడి చేసింది. టెహ్రాన్‌లోని సుప్రీంనేత ఖమేనీ నివాసంపై ఏడు క్షిపణులతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టినట్లు తన వీడియో సందేశంలో తెలిపారు.
జెరుసలాం: ఇరాన్(Iran) ఇవాళ అకస్మికంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. టెహ్రాన్‌లో ఉన్న ఆ దేశ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ నివాసంపై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని పాస్చేర్ జిల్లాలో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. చాలా కట్టుదిట్టమైన కాంపౌండ్ ఉన్న నివాసం, ఆఫీసుపై అటాక్ జరిగింది. ఆ ప్రాంతంలోనే ఖమేనీ నివాసం ఉన్నది. ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం సుమారు ఆ ప్రాంతంపై ఏడు మిస్సైళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
మరో వైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ట్రుత్ సోషల్‌లో ఆయన దాన్ని పోస్టు చేశారు. ఇరాన్‌పై సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. విషపూరిత ఇరానీ పాలకుల నుంచి అమెరికా ప్రజలను రక్షించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశం అన్నారు. అయితే ఇరాన్‌పై జరిపిన దాడులను ఇజ్రాయెల్ సహాయంతో చేపట్టినట్లు ఆయన ప్రత్యక్షంగా తన సందేశంలో వెల్లడించలేదు.
ఇరాన్లో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ వల్ల అమెరికా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తన వీడియో సందేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇరానీ పాలకులు చంపాలనుకుంటున్నారని, అయితే అమెరికా సాహసోపేత సైనికులు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నదని, యుద్ధంలో ఇది సహజమే అని అన్నారు. కానీ ఇది ఇప్పటి కోసం కాదు అని, భవిష్యత్తు కోసం అని, ఇదో ఉత్తమ కార్యమన్నారు.
🔴 BREAKING: Trump announces war on Iran
Trump says Iran attacks aim “to defend the American people”.
Iran can never have a nuclear program. We will annihilate their every army and missile industry. pic.twitter.com/6ofU1UO2hf
— Saturn World News🟦 (@saturn16409) February 28, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

