Immunity | ఈ ఆహారాలను రోజూ తీసుకోండి.. శరీర రోగ నిరోధక శక్తి సహజసిద్ధంగా పెరుగుతుంది..
శరీరానికి రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. తగినంత రోగనిరోధక శక్తి కలిగి ఉండడం వల్ల ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకోవచ్చు. అయితే ఈ రోగనిరోధక శక్తి రాత్రికి రాత్రే శరీరంలో తయారవ్వదు. ప్రతిరోజూ తీసుకునే ఆహారాల ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
Immunity | శరీరానికి రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. తగినంత రోగనిరోధక శక్తి కలిగి ఉండడం వల్ల ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకోవచ్చు. అయితే ఈ రోగనిరోధక శక్తి రాత్రికి రాత్రే శరీరంలో తయారవ్వదు. ప్రతిరోజూ తీసుకునే ఆహారాల ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. బలమైన రోగనిరోధక శక్తి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాపై ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మందులు, ఖరీదైన ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. రోజూ తీసుకునే భోజనం ద్వారా కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఇన్పెక్షన్ లతో పోరాడే శక్తిని, అనారోగ్యానికి గురి అయినప్పుడు త్వరగా కోలుకునే శక్తిని పొందవచ్చు. రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే కొన్ని రకాల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లు, కూరగాయలు..
నారింజ, నిమ్మకాయలు, బెర్రీలు, పాలకూర, క్యారెట్ వంటి ఆహారాలు విటమిన్ ఎ, సి వంటి పోషకాలను కలిగి ఉంటాయి. వీటితో పాటు రోగనిరోధక శక్తికి మద్దతును ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి పదార్థాలు శరీరం వాపుతో పోరాడడానికి, సహజ రక్షణ ప్రతిస్పందనలకు కావల్సిన మద్దతును ఇస్తాయి. పెరుగు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కటి పేగు ఆరోగ్యం రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. గింజలు, విత్తనాలు వంటి ఆహారాలు జింక్, విటమిన్ ఇలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి.
అల్లం, పసుపు..
అలాగే భోజన విషయంలో చాలా మంది చేసే చిన్న ఎంపికలే పెద్ద తేడాను కలిగిస్తాయి. భోజనంలో పండ్లు, కూరగాయలతో పాటు వంటలల్లో పసుపు, అల్లం వంటి వాటిని జోడించడం వల్ల రోగనిరోధక శక్తి క్రమంగా పెరుగుతుంది. అలాగే గుడ్లు, కాయ ధాన్యాలు వంటి ప్రోటీన్ ఉండే ఆహారాలు రోగనిరోధక కణాలను మరమ్మత్తు చేయడంలో వాటిని నిర్మించడంలో దోహదపడతాయి. ఇక ఆహారం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడానికి రెండు నుండి నాలుగు వారాల సమయం పడుతుంది. అయితే సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇటువంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని, శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- immunity
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

