Rajpal Yadav | యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన రాజ్‌పాల్ యాదవ్.. అందరికోసం అంటున్న కమెడియన్
Rajpal Yadav : బాలీవుడ్ నటుడు, కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ విషయాన్ని శనివారం ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Rajpal Yadav : బాలీవుడ్ నటుడు, కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ విషయాన్ని శనివారం ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రాజ్‌పాల్ యాదవ్ ఇటీవల చెక్ బౌన్స్ కేసులో జైలులో లొంగిపోయారు. తాను చెల్లించాల్సిన డబ్బులు అందజేయలేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు రాజ్‌పాల్ యాదవ్ జైలులో లొంగిపోయారు.
తిహార్ జైలులో ఉన్న రాజ్‌పాల్ యాదవ్‌కు దాదాపు రెండు వారాల తర్వాత, ఈ నెల 17న మధ్యంతర బెయిల్ లభించింది. రూ.1.5 కోట్ల డిపాజిట్ అనంతరం అతడికి కోర్టు మార్చి 18 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతడికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, వరుణ్ ధావన్, సోనూ సూద్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులు కూడా సాయం చేశారు. ఈ నేపథ్యంలో కొంత డబ్బు సమకూరడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అతడు కొత్త కెరీర్‌పై దృష్టి సారించాడు.
ఈ నేపథ్యంలో తాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ‘రాజ్‌పాల్ నౌరంగ్ యాదవ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో అన్ని వయసులవారికి నచ్చే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉంటుందన్నాడు. వ్లాగ్స్, మినీ సిరీస్, కామెడీ, బీటీఎస్ మూమెంట్స్ వంటివి షేర్ చేస్తానని హామీ ఇచ్చాడు. తన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరాడు. దీంతో అతడికి చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త జర్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

