పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పులేం ఉండవు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగిపోతుంటాయి. కీలకమైన వ్యవహారాల్లో మాత్రం అనుకున్నంత పురోగతి ఉండదు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఏల్నాటి శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ మేరకు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి.
గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురవుతాయి. డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చవుతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరుల సహకారం లభిస్తుంది. వారాంతం నుంచి పరిస్థితుల్లో అనుకూలమైన మార్పు వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. లక్ష్మీదేవి ధ్యానం చేసుకోండి.
ఈ వారం ఒత్తిడితో గడుస్తుంది. జీవనశైలిలో మార్పులు ఏర్పడతాయి. వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అవి మీ మేలుకే అని గ్రహించండి. మాటతీరుతో పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉన్నా… అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. క్రియేటివ్ పనులు చేపడతారు. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. శివారాధన శుభప్రదం.
కుటుంబంలో కలహ వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. లగ్నంలో గురువు కొంత అండగా ఉన్నాడు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. స్త్రీ మూలకంగా ధనసాయం అందుతుంది. రుణబాధలు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. పనిభారం పెరుగుతుంది. వారాంతంలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
వారం కాస్త తికమకగా సాగుతుంది. అనవసరమైన విషయాల్లో పట్టుదలకు పోతారు. అవసరమైన విషయాలను గాలికి విడిచిపెడతారు. పెద్దల సూచన మేరకు వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో ఏమరుపాటు కూడదు. స్థిరాస్తిరంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు అందుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నాయి. ఆహారం విషయంలో సమయపాలన పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
ఈ వారం విశేషంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచనలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులకు అండగా నిలుస్తారు. సోదరుల మూలకంగా మేలు పొందుతారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
గతంలో చేజారిన పరిస్థితులపై మళ్లీ పట్టుబిగిస్తారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి.. అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆసక్తి నిలుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. చేపట్టిన పనులను సృజనాత్మకంగా ముందుకు తీసుకెళ్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేపట్టే అవకాశం ఉంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
పట్టుదల పెరుగుతుంది. అదే సమయంలో పరిస్థితులు కూడా కొంత కఠినంగా మారుతాయి. అయినా, మీరు అనుకున్నది సాధించడానికి ఇది అనువైన సమయం. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. వారిచ్చే సూచనలు పాటించి మెరుగైన ఫలితాలు పొందుతారు. తల్లి తరఫువారితో కొన్ని చికాకులు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు పనికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
గతవారం అండగా ఉన్న బుధుడి బలం ఈ వారం సన్నగిల్లింది. నిన్నటిదాకా అనుకూలంగా ఉన్న పరిస్థితులు కొంత ప్రతికూలంగా పరిణమించవచ్చు. పితృవర్గంతో కలహం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికం అవుతాయి. ఆరోగ్యం ఓ మోస్తరుగా ఉంటుంది. వారాంతంలో అనుకూల ఫలితాలున్నాయి. శుభవార్త వింటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
ఈ వారం ప్రశాంతంగా సాగుతుంది. సోదరులు, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆస్తి తగాదాలు కొంత పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన కనిపిస్తున్నది. రాజకీయాల్లో ఉన్నవారికి ఆరోగ్యభంగం. వారాంతంలో కుటుంబ ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. కఠినమైన నిర్ణయాలకు ఇది సమయం కాదు. మాట తూలకుండా ఉండండి. శివారాధన శుభప్రదం.
మీరు ఊహించిన దానికి భిన్నంగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. సహోద్యోగులతో చికాకులు తప్పవు. కఠినంగా వ్యవహరించడం వల్ల.. స్నేహితులు కొంత దూరం పాటించే పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. జీవిత భాగస్వామి మాటకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గణపతిని ఆరాధించండి.
ఈ వారం కొంత భారంగా సాగుతుంది. ఆర్థికంగా లోటు ఏర్పడుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. పెద్దల సలహాలు పాటించే ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అందుకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in