Ravi Shastri : భారత దిగ్గజం రవి శాస్త్రి (Ravi Shastri)కి ప్రత్యేక గౌరవం లభించనుంది. తొలి వరల్డ్‌కప్ హీరో రవి గౌరవార్థం పెవిలియన్ ఏర్పాటు చేయాలని ముంబై క్రికెట్ సంఘం (MCA) సంకల్పించింది. ప్రస్తుతం పొట్టి కప్‌లో కామెంటేటర్‌గా అలరిస్తున్న రవి పేరును వాంఖడే మైదానంలోని లెవల్ 1 స్టాండ్‌కు ఖరారు చేశామని ఎంసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ లెజెండ్‌కు ఈ గౌరవం దక్కడం పట్ల అభిమానులు, మాజీ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమదైన ఆటతో భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లు చాలామంది. సుదీర్ఘ కాలం సేవలందించి.. క్రికెట్ వ్యాప్తికి తోడ్పడిన ఈ దిగ్గజాలను ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలు గొప్పగా గౌరవిస్తుంటాయి. ఈ క్రమంలోనే వారి పేరు మైదానంలో నిలిచిపోయేలా స్టాండ్స్ ఏర్పాటు చేస్తుంటాయి. ముంబై క్రికెట్ సంఘం కూడా ఇప్పుడు లెజెండ్ రవి శాస్త్రి పేరుతో పెవిలియన్ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ (Ajinkya Naik) వెల్లడించాడు.
The Mumbai Cricket Association has decided to name the Level 1 stand below the press box at the Wankhede Stadium after Ravi Shastri
Full story: https://t.co/sWYdaDdS2s pic.twitter.com/vIC2Y2uC3a
— ESPNcricinfo (@ESPNcricinfo) February 27, 2026
‘దిగ్గజ ఆటగాళ్లు వేసిన పునాదులపైనే ముంబై క్రికెట్ నిర్మితమైంది. దేశానికి, ముంబై పట్టణానికి గౌరవం, గుర్తింపు తీసుకొచ్చిన మేటి క్రికెటర్లను గౌరవించడం మా బాధ్యత. వాంఖడే మైదానంలో ప్రెస్ స్టాండ్‌కు పక్కనే ఉండే లెవల్ 1 స్టాండ్‌కు రవి శాస్త్రి పేరు పెడుతున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అజింక్యా నాయక్ పేర్కొన్నాడు. శాస్త్రి పేరును స్టాండ్స్‌కు ఖరారు చేయగా.. వాంఖడేలోని మూడు గేట్లకు వెటరన్స్ దిలీప్ సర్దేశాయ్, ఏక్నాథ్ సోల్కర్, డయాని ఎడుల్జి పేర్లు పెడుతున్నట్టు ఎంసీఏ తెలిపింది.
దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడిన రవి శాస్త్రి.. ఆపై భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 1983లో వన్డే వరల్డ్‌కప్ విజేతగా అవతవరించిన కపిల్ డెవిల్స్ జట్టులో శాస్త్రి సభ్యుడు. 80 టెస్టులు, 150 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్య వహించిన ఈ వెటరన్ క్రికెటర్.. ఆపై కోచ్‌గానూ మెప్పించాడు. 2017 నుంచి 2021 మధ్య టీమిండియాను గొప్పగా తీర్చిదిద్దాడు. అతడి హయాంలోనే.. భారత్ నంబర్ 1 జట్టుగా నిలిచింది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలుపొందింది.
The Mumbai Cricket Association has decided to name the Level 1 stand at the Wankhede Stadium after Ravi Shastri https://t.co/zxMmHIVtl1
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026