చెన్నై: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద ఉన్న భక్తుల పట్ల ఒక వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. జోక్యం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి ప్రయత్నించాడు. (Man Attempts To Attack Cop With Knife) చివరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపూర్‌లోని వీరరాఘవ పెరుమాళ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కాగా, ఒక వ్యక్తి భక్తులను దుర్భాషలాడటంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భద్రత కోసం అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. పాకెట్ కత్తితో దూకుడుగా పోలీస్ మీదకు వెళ్లాడు. ఆ కానిస్టేబుల్ బెల్ట్‌తో కత్తి దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో మిగతా పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపూర్ సౌత్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ యువకుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అయితే వైద్య పరీక్షల్లో దీనిని నిర్ధారించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే చేతిలోని కత్తితో ఆ వ్యక్తి పోలీస్ మీదకు దూసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Forget the common man, even police who are to ensure safety of the common man are not safe under @arivalayam model governance.
In Tirupur we can see a Man under heavy influence of alcohol trying to stab a policeman in full public view early in the morning as by standees wait to… pic.twitter.com/X1vJAnqAgm— Vinoj P Selvam (@VinojBJP) December 31, 2025
Also Read:
Nomination Papers | శ్మశానవాటికలో నేత.. నామినేషన్ పత్రాలు అక్కడ అందజేసిన పార్టీ
Father Dead, Daughter Starving | ఆకలి బాధతో తండ్రి మృతి.. కృశించిన శరీరంతో కుమార్తె